యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన కియోస్క్ యంత్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోకి ఆదివారం మధ్యాహ్నం నుండి కియోస్కు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా భక్తులకు అందించే సేవలు మరింత సులభతరం అవుతాయని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. కెనరా బ్యాంకు విరాళంగా ఇచ్చిన రూ.10 లక్షల విలువైన ఆరు కియోస్క్ యంత్రాలను ప్రసాద విభాగంలో మూడు, అదే గదులు, డోనర్ సెల్, వ్రత మండపంలో ఒక్కో యూనిట్ చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.