రాజేంద్రనగర్: పహాడీ షరీఫ్ క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహించిన రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం
పహడీషరీఫ్ క్రాస్‌రోడ్ వద్ద రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుంది. గోవా, హర్యానా, మేఘాలయ రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల్లో రూ.4.50 లక్షల విలువైన 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం వారిని సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.