ఒంగోలు అర్బన్: విభిన్న ప్రతిభావంతులకు ఒంగోలులో పరికరాలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు
Ongole Urban, Prakasam | Jun 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాలను అందజేసే కార్యక్రమం డిఇఓ రేణుక నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. 12 రకాల వస్తువులను వారికి అందించడం జరిగిందని డీఈవో తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని ఆమె అన్నారు. అనంతరం ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సహకరిస్తూ వారి అవసరాలు తీరుస్తున్నట్లు అన్నారు.