ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించే ఆయనకు వేద ఆశీర్వచన అందజేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి పూజలు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.