పలమనేరు: జలపాతాలు, ప్రవాహాలలోకి ఎవరు దూకద్దు, మిమ్మల్ని నమ్ముకొని ఓ కుటుంబం ఉంటుంది - కళ్యాణ రేవు బాధిత కుటుంబం
పలమనేరు: పట్టణం కళ్యాణ రేవు జలపాతం నందు మృతి చెందిన యూనిస్ కుటుంబ సభ్యులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు మృతుడు యూనిస్ ను చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు అతని స్నేహితులు కుటుంబీకులు చేరుకుని బోరుమని కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతం మరియు చెరువులు వాగుల్లో దిగవద్దు మిమ్మల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఉంటుంది ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం, మా బిడ్డ లేని లోటు ఎవరు పూడుస్తారు అంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.