డోన్: డోన్ మండలంలో టిడిపి నాయకుడు మృతి,నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
Dhone, Nandyal | Jun 10, 2026 డోన్ మండలంలోని మల్లెంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చిన్న సుంకన్న బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మృతుని నివాసానికి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ పరంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.