ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురం, దైవందిన్నె గ్రామాల మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురికి గాయాలు..
ఆదివారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని కె. తిమ్మాపురం, దైవందిన్నె గ్రామాల మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దైవందిన్నెకు చెందిన రంగన్న, అనసూయ దంపతులతో పాటు ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరుకు వెళ్తున్న రంగన్న, అనసూయల బైక్‌ను తిమ్మాపురం నుంచి వస్తున్న ఈశ్వరగౌడ్ బైక్ ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏనుగుబాల సింగమనేటి శివ, గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.