కుక్కలదొడ్డి గ్రామం లో రైతులకు విద్యుత్, రోడ్ల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా- కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామంలో విద్యుత్, రోడ్ల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని రైల్వే కోడూరు టిడిపి ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మంగళవారం ఆ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే ట్రాక్ అవతల కరెంటు వసతి సరిగా లేక పొలాలు సాగు చేయలేకున్నామని తెలిపారు. రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉందని తెలిపారు. స్పందించిన ఆయన పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎస్టిమేషన్ వేసి, పనులు ప్రారంభించాలని కోరారు.