డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలను చైతన్య పరుస్తున్న ఎస్పీ AR దామోదర్
Ongole Urban, Prakasam | Jul 10, 2025
డిజిటల్ అరెస్ట్ మోసాల పై ప్రజల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేలగాల్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గురువారం ఉదయం డిజిటల్ అరెస్ట్ మోసాల పై ప్రజలను చైతన్య పరుస్తూ జిల్లా ఎస్పీ వీడియో విడుదల చేశారు. మీ పిల్లలు సైబర్ నేరాలలో పాల్గొన్నారని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని వచ్చే కాల్స్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు.