హయత్నగర్: హయాత్ నగర్ లో డ్రైనేజీ పైప్ లైన్ పనులు పరిశీలించిన ఈటెల రాజేందర్. డ్రైనేజీ నీరు వెళ్లేలా తాత్కాలిక కాలువ తవ్వించిన ఎంపీ
డ్రైనేజీ పైప్ లైన్ పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్. గత కొన్ని సంవత్సరాలుగా మురుగు నీరు పేరుకు పోతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎంపీ దృష్టి కీ తీసుకుని రావడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి జేసీబీ సహకారం తో తాత్కాలికంగా నీరు వెళ్ళేలా చర్యలు చేపట్టారు. వెంటనే పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు