పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి చైనా బజార్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు తయారుచేసే పాలిమర్ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికలు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.