డోన్: గొర్లగుట్ట గ్రామానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు: బేతంచర్ల ఎంపీడీవో ఫజుల్ రెహమాన్
Dhone, Nandyal | Aug 2, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గోర్లగుట్టకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (PMAGY) కింద రూ.20 లక్షలు మంజూరైనట్లు ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ తెలిపారు. ఈ నిధులతో గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.