వర్ని: బిల్లులు ఇప్పించాల్సిన నాయకులే రాజకీయం చేయడం సమంజసం కాదు ;కోటగిరిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆరోపణ
డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి బిల్లులు రాక అప్పుల పాలై కడుపు మండి రోడ్ ఎక్కితే కొందరు రాజకీయ నాయకులు తాము రాజకీయం చేస్తున్నారు అనడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోటగిరి మండల కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ బిల్లులు రాని బాధితులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి నిర్మాణం కొరకు పొలాలు బంగారం అమ్మి నిర్మాణం చేపట్టామని రెండేళ్లుగా బిల్లులు రాకపోతే హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు ఇంటి చుట్టూ తిరిగిన బిల్లులు చెల్లించడం లేదని బకాయి పడ్డ బిల్లులను ఇప్పించాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు.