కనిగిరి: బాణసంచా దుకాణదారులు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు
హనుమంతుని పాడు: దీపావళి పండుగ సందర్భంగా హనుమంతునిపాడు లో ఏర్పాటుచేసిన టపాసుల విక్రయ దుకాణాలను హనుమంతునిపాడు ఎస్సై కే మాధవరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టపాసుల విక్రయదారులతో ఎస్సై మాట్లాడుతూ... బాణసంచా విక్రయ దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా దుకాణాల వద్ద ఇసుక, మంచినీటి డ్రమ్ములను ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా అనుకోని అవాంతరం జరిగి , అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.