గుంటూరు: జిల్లా పూర్వపు ఎస్పి సతీష్ కుమార్ ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Guntur, Guntur | Sep 16, 2025 సుమారు సంవత్సరం పైగా గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా పూర్వపు ఎస్పి సతీష్ కుమార్ అన్నారు. బదిలీపై వెళుతున్న ఆయనను గురువారం ఉదయం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనను గుంటూరు జిల్లా ఎస్పీగా నియమించిన అనంతరం దాదాపుగా 14 నెలలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. తన వీడ్కోలు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.