కామారెడ్డి: ఏలాంటి షరతులు లేకుండా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను మొత్తం విడుదల చేయాలి : రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ డిమాండ్
కామారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విటల్ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కలశాలల బంద్ కు పూర్తి మద్దతు అని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి స్కాలర్షిప్ ,రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం తో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలని హెచ్చరించారు.