నంద్యాల అర్బన్: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించాలి: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాల జిల్లాలో చేపడుతున్న హెరిత అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి విద్యాసంస్థల ఆవరణలను పచ్చదనంతో నింపాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు మంగళవారం జూపాడుబంగ్లా మండలంలోని కస్తూరి బాలికల విద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.ఆయా విద్యాసంస్థల ప్రాంగణంలో చేపట్టిన అల్ట్రా హైటెక్ సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి మొక్కల పెంపకం సంరక్షణ నీటి వసతి వాటి పెరుగుదల స్థితి తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు