పాన్‌గల్: మార్చి 2న వనపర్తి జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో సీఎం సభ ఏర్పాట్లు ను పరిశీలన ఎమ్మెల్యే, టి ఎఫ్ ఎం సి చైర్మన్
మార్చి 2న వనపర్తి జిల్లాలో జరగబోయే సీఎం పర్యటనకు సంబంధించి గురువారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో పాటు, టీఎఫ్ఎంసీ ఛైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, స్థానిక ఎమ్మెల్యే మెఘారెడ్డి పలువురు పరిశీలించారు. హెలీపాడ్, సభాస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కలెక్టర్ ఆదర్ష్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, సంబంధిత అధికారులు ఉన్నారు.