కనిగిరి: లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటనకు 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
పెద చెల్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఈనెల 11వ తేదీన సీఎం చంద్రబాబు ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం లింగన్నపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సభ వేదిక, పార్కింగ్ ఏరియా, వీఐపీల వాహనాల రాక తదితర అంశాలను పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ మీడియాతో తెలిపారు. సీఎం సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.