డోన్: బేతంచెర్ల దుర్గా పేట తాగునీటి సమస్యకు పరిష్కారం
Dhone, Nandyal | May 30, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల దుర్గాపేట న్యూ బిల్డింగ్ కాలనీలో రెండు నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు శనివారం పరిష్కారం లభించింది. బోరుబావికి సంబంధించిన విద్యుత్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేయడంతో కాలనీలో నీటి సరఫరా నిలిచిపోయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఛైర్మన్ చలం రెడ్డి ఆదేశాల మేరకు నగర పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టి బోరుబావి మరమ్మతు పనులు పూర్తి చేశారు. నీటి సరఫరాను పునరుద్ధరించారు