కనిగిరి: పట్టణంలో అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ డీఎస్సీ 2025లో ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించిన యువతి, యువకులకు అభినందన సభ
కనిగిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ 2025 పరీక్షల్లో విజేతలుగా నిలిచి ఉపాధ్యాయులుగా పోస్టులు సాధించిన యువతీ యువకులకు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ పోస్టులు సాధించిన యువతీ, యువకులను ఘనంగా సన్మానించారు. అంజుమన్ కమిటీ అధ్యక్షులు షేక్ అహమ్మద్ మాట్లాడుతూ... కనిగిరి పట్టణంలో డీఎస్సీ పరీక్షల్లో ఊహించని విధంగా ఎక్కువమంది ఉపాధ్యాయ పోస్టులు సాధించడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న డీఎస్సీ పరీక్షల్లో యువత ఉపాధ్యాయ ఉద్యోగాలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.