గుంతకల్లు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నిరసన ర్యాలీ, పట్టణంలో పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వైవీఆర్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న భారీ నిరసన ర్యాలీ ఉంటుందని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో చేపట్టే నిరసన ర్యాలీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ, ర్యాలీకి సంబంధించి వైసీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.