అక్రమ ఆయుధాలపై నిఘా పెంచిన సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, హుస్సైనీఆలం పోలీసులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ఓ నాటు పిస్టల్ పట్టుబడింది. ఈ కేసులో అమ్హద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి తుపాకీ, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను బెదిరించేందుకు రూ.80 వేలకు ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు