కే.గంగవరం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శుక్రవారం కే.గంగవరం మండలంలోని పలు గ్రామాలలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.