రాయచోటి పట్టణంలో ఆధునిక క్రీడా స్టేడియం ఏర్పాటు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ప్రత్యేక సహకారంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యాయి. ఇందుకు సంబంధించి ల్యాండ్ సర్వే పనులను అధికారులు ప్రారంభించారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలు, ఉత్తమ డిజైన్తో స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వసతులు కల్పించడంతో పాటు, రాయచోటి యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేలా స్టేడియం రూపకల్పన చేయనున్నట్లు అధికారులు తెలిపారు