ఆళ్లగడ్డ: గుండుపాపల ప్రకృతి వ్యవసాయంతోనే భూసార రక్షణ : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం క్షీణిస్తోందని, రైతులు పకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ఆచరించి భూమిని కాపాడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు, బుధవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు, గ్రామంలోని స్థానిక షణ్ముఖగో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.