నారాయణపేట్: దేవీ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని: ఎస్పీ యోగేష్ గౌతమ్
దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దుర్గాదేవి నవరాత్రి శుభాకాంక్షలు ఆదివారం5 గంటల సమయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గ మాత విగ్రహాలను పేట జిల్లాలో మొత్తం 157 విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.దుర్గామాత విగ్రహాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సూచించారు.మండపాల దగ్గర ఆర్గనైజర్లు బాధ్యత కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉండాలని తెలిపారు మండపాల దగ్గర పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీసులకు తనిఖీ సమయంలో ఆర్గనైజర్లు సహకరించాలని కోరారు.