జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీ సిపిఐ సీనియర్ నాయకులు సత్యనారాయణ కరెంట్ షాక్ తో మృతి
జూలూరుపాడు మండలంలోని కొత్తూరు పంచాయతీలో విద్యుత్ షాక్ తో సిపిఐ సీనియర్ నాయకులు సత్యనారాయణ సోమవారం ఉదయం మృతి చెందారు.. తన ఇంట్లో ట్రాక్టర్ కడిగేందుకు కొత్తగా తెచ్చిన యంత్రానికి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపారు.. సత్యనారాయణ కరెంటు షాక్ తో మరణించటం బాధాకరమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చిల్డ్రన్ నరేందర్ కుమార్ అన్నారు.. వారి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. మండలంలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు..