ఆముదాలవలస సమీపాన ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం ఆముదాలవలస సమీపాన మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న ఆర్టీసీ బస్. ద్విచక్ర వాహనం లో ప్రయాణిస్తున్న నరసప్ప అనే వ్యక్తికి కుడికాలు విరిగిపోవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. తోట నుండి ఇంటికి వెళ్తుండగా ఆముదాలవలస ఊరి బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.