ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం త్రవ్వకుంట గ్రామ సమీపంలోని పొగాకు బోర్డును పరిశీలించిన వైసీపీ ఇంచార్జ్ రవిబాబు, మాజీమంత్రి మెరుగు నాగార్జున
Ongole Urban, Prakasam | May 16, 2026
కూటమి పాలనలో పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ రైతులకు గిట్టుబాటు ధర దక్కడంలేదని వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట పొగాకు బోర్డును శనివారం వైసీపీ నేతల బృందం సందర్శించింది. పొగాకు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.