ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలంలో భారీ వర్షం, వాతావరణం చల్లబడడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్న స్థానిక ప్రజలు
Ongole Urban, Prakasam | May 6, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో బుధవారం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మబ్బు పట్టి ఉండి అకస్మాత్తుగా చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం.. తర్వాత భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొద్దిరోజులుగా ప్రకాశం జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 11 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.