అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రైళ్ల కోసం వచ్చిన ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా మారింది. కాగా గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్ రైలును మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ లోకి తీసుకొచ్చారు. అయితే ఎంత సేపటికి ప్యాసింజర్ రైలు బోగీల తలుపులు తెరవకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రైలు తలుపులు తెరిచే వరకు మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు లగేజ్ తో తలుపుల దగ్గర నిల్చున్నారు. తిరుపతి ప్యాసింజర్ రైలు ప్లాట్ ఫామ్ పైన నిలపడంతో తలుపులు తెరుచుకునేందుకు ప్రయాణికులు శతవిధాలుగా ప్రయత్నం చేశారు.