అమలాపురం: కోనసీమలో 16,17 తేదీల్లో 50 కొత్త కొబ్బరి పీచు పరిశ్రమల స్థాపన వర్క్‌షాప్
కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జూలై 16, 17 తేదీల్లో అనాతవరం కన్వెన్షన్ హాల్‌లో రెండు రోజుల కొబ్బరి పీచు పరిశ్రమల వర్క్‌షాప్ నిర్వహిస్తామని చెప్పారు. 50 కొత్త పరిశ్రమల ఏర్పాటును లక్ష్యంగా, 350 ప్రతినిధులను ఆహ్వానించారు. ప్రత్యేక స్టాల్స్, QR కోడ్ రిజిస్ట్రేషన్ తదితర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.