నంద్యాల అర్బన్: నంద్యాల పండ్ల మార్కెట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
Nandyal Urban, Nandyal | May 7, 2026
. నంద్యాల పండ్ల మార్కెట్లో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పండ్లను మగ్గబెట్టేందుకు హానికరమైన కార్బైడ్ వాడకూడదని వ్యాపారులను హెచ్చరించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదించిన ఎథిలీన్ ప్యాకెట్లను మాత్రమే నిబంధనల మేరకు వాడాలన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు