ఒంగోలు అర్బన్: ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు విద్యార్థులతో కిక్కిరిసిపోయింది, బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్
Ongole Urban, Prakasam | Apr 2, 2026
ఒంగోలు బస్టాండ్ గురువారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పదో తరగతి పరీక్షలు పూర్తికావడంతో తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకుని సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో బస్టాండ్ వద్ద భారీ రద్దీ నెలకొంది. బస్సులు సరిపోకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల కొద్దీ వేచిచూడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.