గూడెం కొత్తవీధి మండలం సీలేరు పోలీసుల తనిఖీల్లో స్కూటీ మీద తరలిస్తున్న గంజాయి పట్టివేత:ఒకరి అరెస్టు,ఒకరు పరారీ
గూడెం కొత్త వీధి మండలం సీలేరు జెన్కో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీల్లో ద్విచక్ర వాహనం మీద గంజాయి తరలిస్తూ ఒక వ్యక్తి పట్టుబడినట్లు సీలేరు ఎస్సై రవీంద్ర తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వచ్చిన స్కూటీని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నించగా ఒక వ్యక్తి పారిపోయాడని, మరొక వ్యక్తి పట్టుపడ్డాడని కాకినాడ జిల్లా కోటనందూరు కి చెందిన గోవిందరాజుల్ని అదుపులో తీసుకుని అతను వద్ద నుంచి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు.