అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కాలనీలలో పంచాయితీ అధికారుల ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కాలనీలలోని మురికి కాలువలు చెత్తను శుభ్రం చేశారు. స్థానిక టిడిపి నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. గ్రామంలో మలాథియాన్, పొడి సున్నం, బ్లీచింగ్ పౌడర్లను అవసరమేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికులకు అందుబాటులో ఉంచామని ఇన్చార్జ్ ఈఓఆర్డి గోపాల్ పేర్కొన్నారు.