ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సబ్ జైల్ తనిఖీ చేసిన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
ఆళ్లగడ్డ పట్టణంలోని ఉపకారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జ్ భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు, కారాగారంలోని ముద్దాయిలతో మాట్లాడారు, జైల్లోని సౌకర్యాలు భోజన వసతి వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు, కారాగారంలోనే ఎక్కువ రోజులుగా ఎంతమంది ముద్దాయిలు ఉన్నారని వివరాలను సేకరించారు, ఈ కార్యక్రమంలో సబ్ జైల్ ఇంచార్జి యోగేష్ కుమార్, జైల్ సిబ్బంది ప్యానల్ లాయర్ బాబా ఫక్రుద్దీన్లు పాల్గొన్నారు.