హెచ్ కొట్టాల వద్ద ప్రత్యామ్నాయ రోడ్డు వేశాకే వంతెన పనులు ప్రారంభిస్తాం బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి
Dhone, Nandyal | Apr 13, 2026 నంద్యాల జిల్లాబేతంచర్ల మండలం హెచ్ కొట్టాల సమీపంలో రైతులకు, భక్తులకు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేశాకే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు చేపట్టాలని తహశీల్దార్ నాగమణి సూచించారు. ముచ్చట్ల ఆలయానికి, నాపరాల గనులకు వెళ్లే దారి మూతపడటంతో స్థానికులు ఆమెకు సోమవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆమె, ఈనెల 16 వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలపాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు