శ్రీశైలంలో డివైడర్ ను ఢీకొన్న టూరిస్ట్ బస్సు, తప్పిన పెను ప్రమాదం.
శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి వచ్చిన ఓ టూరిస్ట్ బస్సు క్షేత్ర పరిధిలోని డివైడర్ను బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది విచారిస్తున్నారు.