కర్నూలు: రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై అసత్య ప్రచారం తగదు అని కర్నూలు ఎంపీ బస్తీ పాటి నాగరాజు
కర్నూలు : రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై అసత్య ప్రచారం తగదు అని కర్నూలు ఎంపీ బస్తీ పాటి నాగరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నగరంలోని ఏబీసీ క్యాంపు క్వార్టర్స్‌ను మంత్రి కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్నే కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.వైసిపి నాయకులు ప్రజల్లో తప్పుదారి పట్టించేలా మంత్రి భరత్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నగర అభివృద్ధి కోసమే చర్యలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.