కోడుమూరు: సమయానికి విద్యార్థి బస్సు నడపాలని గూడూరులో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
గూడూరు పట్టణానికి సమయానికి విద్యార్థి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు పాఠశాల, కళాశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఖాజావలి, శేఖర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల నుంచి చేరుకోవడానికి సరైన సమయంలో బస్సులు నడపాలని కోరారు. వేళకు బస్సులు రాక చాలామంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు.