నిడమానూరు: వేంపాడులో సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామపంచాయతీ నందు ఏర్పాటుచేసిన సబ్ స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతాంగానికి విద్యుత్ కొరత లేకుండా చూస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రైతు భరోసా రైతు రుణమాఫీ అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.