నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీప ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం లభించింది. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షంతో పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.