బాల్కొండ: తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై దాడి, ఆరు ఈత చెట్లు నరికివేత
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌లో గౌడ కులస్తులపై దాడి, 6 ఈత చెట్లను నరికివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీత కార్మికులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. పోలీసుల విచారణ జరుగుతుండగా, విడిసి సభ్యులు గీత కార్మికులపై దాడికి పాల్పడ్డారు. వారి వాహనాలు, సంఘం భవనంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మీడియా ప్రతినిధిపై కూడా దాడి జరిగింది. గ్రామానికి చేరుకున్న పోలీసు బలగాలు, సీపీ సాయి చైతన్య బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.