నంద్యాల అర్బన్: నంద్యాలలో అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
Nandyal Urban, Nandyal | Jul 8, 2026
నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బుధవారం రైతు నగర్ లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, డ్రైనేజీ కాలువల నిర్వహణను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని అన్న క్యాంటీన్ను సందర్శించి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు.