రాయచోటి పట్టణం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాలు భక్తిపూర్వకంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలంకరణ మధ్య అర్చకులు నటరాజస్వామి, ఆలయ కమిటీ సభ్యులు అరమాటి గంగిరెడ్డి పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.గ్రామోత్సవాలను వీక్షించేందుకు రాయచోటి నియోజకవర్గం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు స్వామివారికి కాయకర్పూరం సమర్పించి దర్శించుకున్నారు.ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పట్టణ, రూరల్, లక్కిరెడ్డిపల్లి సీఐలు వెంకటాచలపతి, వరప్రసాద్, కొండారెడ్డి నే