ఆళ్లగడ్డ: మందలూరు గ్రామంలో అన్నదమ్ముల మధ్య గొడవ : అనుమానంతో అన్న ఆత్మహత్య
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని మందలూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది, గ్రామానికి చెందిన ఎర్రగొల్ల సుంకన్న కుమారుడు సంజీవరాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు, మంగళవారం జరిగిన ఘర్షణలో తమ్ముడు తనను దూషించాడని అనుమానంతో బుధవారం ఇంట్లో ఉరేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు, మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె అన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేపట్టామని రుద్రవరం ఎస్ఐ జయప్ప తెలిపారు