కావలి: కావలిలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు....
కావలి పట్టణం బృందావనం కాలనీలోనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8వ రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.ఉభయకర్తలు పాల్గొని పూజలు చేశారు.స్వామివారికి మహిళలు కోలాటం, చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.