మదనపల్లి పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో ఏసీబీ సోదాలు... అవినీతి అధికారుల గుండెల్లో గుబులు..
మదనపల్లి పట్టణంలో ఎస్బిఐ కాలనీ నందు శుక్రవారం సాయంత్రం 6:00 ప్రాంతంలో ఏసీబీ అధికారులు సోదాలు జరగడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. గురువారం రాత్రి రామసముద్రం మండలంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎస్సై విచారంలో రూరల్ సీఐ పాత్ర కూడా ఉందని ప్రాథమికంగా తేలడంతో మదనపల్లి పట్టణంలో ఎస్బిఐ కాలనీ నందు సిఐ రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.